KCR Meeting With Harish Rao | భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు శనివారం భేటీ అయ్యారు.
విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న హరీష్, అనంతరం ఎర్రవెల్లి లోని కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు కూడా అక్కడే ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ అంశంపై కేసీఆర్-హరీష్ రావు చర్చించే అవకాశం ఉంది. బీఆరెస్ నుంచి కవితను సస్పెండ్ చేయడం ఆ వెంటనే ఆమె ఎమ్మెల్సీ పదవికి మరియు బీఆరెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అనంతరం హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావు భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.









