Ram Charan meets Karnataka Chief Minister Siddaramaiah in Mysuru | గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ నిమిత్తం మైసూర్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు.
మైసూర్ లోని నివాసంలో సీఎంను రాం చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మరియు ఎమ్మెల్సీ యతింధ్రా సిద్ధరామయ్య కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రాం చరణ్ ను ముఖ్యమంత్రి సన్మానించారు. కాసేపు ఇరువురు ముచ్చటించుకున్నారు.
శనివారం అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణించారు. ఈ క్రమంలో రాం చరణ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్ది షూటింగ్ లో పాల్గొనేందుకు ఆయన తిరిగి మైసూర్ వెళ్లారు.
దర్శకుడు బుచ్చి బాబు పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో రాం చరణ్ సరసన ఝాన్వీ కపూర్ నటిస్తున్నారు.









