Modi meets Xi Jinping | డ్రాగన్-ఏనుగు కలిసి నడవాలని పిలుపునిచ్చారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనా వెళ్లిన విషయం తెల్సిందే.
ఈ సందర్భంగా మోదీ-జిన్ పింగ్ తీయాంజిన్ లో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతూ చైనాతో సానుకూల సంబంధాలను కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొన్నాయని పేర్కొన్నారు.
ఇరుదేశాల మధ్య సంబంధాలు, సహకారంతో 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు.
అనంతరం మాట్లాడిన జిన్ పింగ్ ప్రధాని మోదీతో భేటీ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు గ్లోబల్ సౌత్ లో ముఖ్యమైన సభ్యులని పేర్కొన్నారు. ఇరుదేశాలు పరస్పర సహకారం, ఇరు దేశాలకు దోహదపడే అంశాల్లో డ్రాగన్-ఏనుగు కలిసి నడవాలనే నిర్ణయం సరైందన్నారు.









