Konda Vishweshwar Reddy News | బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీలోని పలువురు నాయకులు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వినూత్న నిరసన తెలిపారు.
తన గెలుపు కోసం కృషి చేసిన వారికి, తాను సూచించిన నాయకులకు పార్టీ పదవులు ఇవ్వడం లేదని గత కొంతకాలంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్న విషయం తెల్సిందే.
ఈ క్రమంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ ను బహుమతిగా ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రశేఖర్ తివారీని కలిస్తే బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావును కలవాలని చెబుతున్నారని పేర్కొన్నారు. రామచందర్ రావును కలిస్తే అభయ్ పాటిల్ ను కలవమంటున్నారని తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు తీరు, పార్టీ వ్యవహారం పై మండిపడ్డారు.









