MLC Kavitha Sensational Comments on Jagadish Reddy | తనపై విమర్శలు చేస్తున్న బీఆరెస్ నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీని నాశనం చేసిన ఓ లిల్లీపుట్ నాయకుడు తనపై మాట్లాడుతున్నారని, ఆయనకు ప్రోత్సాహం ఇస్తుంది ఎవరో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
నల్గొండ జిల్లాలో అన్ని సీట్లల్లో బీఆరెస్ ఓడిపోయిందని ఆ లిల్లీపుట్ నాయకుడు చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచాడని పేర్కొన్నారు. సదరు నాయకుడు ప్రజా ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని, కేసీఆర్ లేకపోతే ఆయన ఎవరు అని కవిత ప్రశ్నించారు.
ఈ లిల్లీపుట్ నాయకుడు తనపై మాట్లాడగానే మరో చిన్నపిల్లగాడు కూడా తనపై విమర్శలు చేస్తున్నాడని కవిత ధ్వజమెత్తారు. అసలు వీరికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంటని కవిత అడిగారు. ఇంటి ఆడబిడ్డపై విమర్శలు చేస్తుంటే బీఆరెస్ సోదరులు మాట్లాడలేదని ఆమె తెలిపారు.
తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను బయటకు లీక్ చేసింది ఎవరని కవిత అడిగారు. బీజేపీలో బీఆరెస్ విలీన ప్రతిపాదన కేటీఆర్ చేశారని ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తాజగా కవిత బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన ఎందుకు అలా మాట్లాడారో తెలీదన్నారు.









