PM Modi Maldives Visit | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం మాల్దీవులకు వెళ్లారు. ఆ దేశ రాజధాని మాలేలోని విమానాశ్రయంలో ప్రధాని దిగారు.
ఈ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరియు విదేశాంగ, రక్షణ, ఆర్థిక, హోంశాఖ మంత్రులు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. పర్యటనలో భాగంగ మోదీ, ముయిజ్జుతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, భారత్-మాల్దీవుల మధ్య ఆర్థిక, రక్షణ, మరియు సముద్ర భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.
2024 అక్టోబర్‌లో ముయిజ్జు భారత్ పర్యటనలో ఆమోదించిన ‘భారత్-మాల్దీవుల సమగ్ర ఆర్థిక మరియు సముద్ర భద్రతా భాగస్వామ్యం’ అమలును కూడా సమీక్షించనున్నారు. ఇదిలా ఉండగా ముయిజ్జు 2023 ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ అనే ప్రచారాన్ని చేపట్టారు.
భారత సైనిక సిబ్బందిని తొలగించాలని డిమాండ్ చేశారు, దీనివల్ల రెండు దేశాల సంబంధాలు ఒక దశలో దెబ్బతిన్నాయి. అయితే, మాల్దీవుల ఆర్థిక సంక్షోభం మరియు భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలన్న అవసరం వల్ల ముయిజ్జు వైఖరి మారింది.









