Ujjaini Mahankali Bonalu Celebrations | లష్కర్ బోనాల ఉత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఉత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించారు.
సాయంత్రం ఫలహారబండ్ల ఊరేగింపు ఉంటుంది. అలాగే సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.









