Rishab Pant-Sunil Gavaskar | ఇంగ్లాండ్-ఇండియా మధ్య తొలి మ్యాచ్ కొనసాగుతుంది. ఈ మ్యాచులో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ విజృంభించాడు.
రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాలతో చెలరేగిపోయాడు. రెండవ ఇన్నింగ్స్ లో 130 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇది పంత్ కు టెస్టుల్లో ఎనిమిదవ శతకం. ఈ నేపథ్యంలో పంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 140 బంతుల్లో 118 పరుగులు చేసిన పంత్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
అయితే పంత్ శతకం చేసిన సమయంలో మైదానంలోనే ఉన్న టీం ఇండియా దిగ్గజ ఆటగాడు సునిల్ గావస్కర్ రిషబ్ కు ఒక రిక్వెస్ట్ చేశారు. సెంచరీ పూర్తయిన నేపథ్యంలో సోమర్ సాల్ట్ వేయాలన్నారు. అయితే మరోకసారి సెంచరీ చేశాక వేస్తానని పంత్ బాదులిచ్చాడు.
రిషబ్, గవాస్కర్ మధ్య మైందనంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తొలి ఇన్నింగ్స్ లో పంత్ శతకం చేసిన సందర్భంగా గావస్కర్ సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్ అంటూ పంత్ ను మెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి.
కారణం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో పంత్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. మెల్బోర్న్ టెస్టులో బొలాండ్ వేసిన బంతిని చెత్త షాట్ ఆడి పంత్ ఔట్ అయ్యాడు.
ఈ సమయంలో గావస్కర్ స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్ అంటూ పంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు స్టుపిడ్ అన్న గావస్కర్ ఇంగ్లాండ్ తో సిరీస్ లో మాత్రం పంత్ ను సూపర్బ్ అని మెచ్చుకోవడం వైరల్ గా మారింది.









