Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’

‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’

PM Modi Warns Pakistan | ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జాతిని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు.

ఈ సందర్భంగా పాకిస్థాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దేశాన్ని ప్రజల్ని రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదం-చర్చలు, ఉగ్రవాదం-వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావని, ఒకేచోట నీళ్లు-రక్తం పారలేవని పేర్కొన్నారు.

“భారతదేశం ప్రతిదాడికి సమాధానం ఇచ్చిన తర్వాత, పాకిస్తాన్ తప్పించుకునే మార్గాలు వెతకడం ప్రారంభించింది. ఉద్రిక్తతలు తగ్గించాలంటూ ప్రపంచం ముందు విజ్ఞప్తి చేయడం మొదలుపెట్టింది. తీవ్ర ఎదురు దాడి కారణంగా గాయపడిన పాకిస్తాన్ సైన్యం, మే 10 మధ్యాహ్నం సమయంలో మన డీజీఎంఓను సంప్రదించింది. అప్పటికే మన దేశం ఉగ్రవాద నిర్మాణాలను భారీగా ధ్వంసం చేసి, ఉగ్రవాదులను చంపేసింది.” అని మోదీ తెలిపారు.

‘గడిచిన గత కొద్ది రోజులలో.. మన దేశానికి ఉన్న బలం – సంయమనం రెండింటినీ చూశాము. ప్రప్రథమంగా.. భారత దేశం రక్షణలో అత్యంత సాహసమైన, ధైర్యవంతమైన ముఖ్యమైన సేవలు అందించినందుకు, ప్రతి భారతీయుడి తరపున, భారతదేశపు సాయుధ దళాలకు, మన నిఘా సంస్థలకు, మన శాస్త్రవేత్తలకు నా వందనాలు. OperationSindoor లక్ష్యాన్ని సాధించడంలో మన వీర శూర సైనికులు అపారమైన ధైర్య – సాహసాలు ప్రదర్శించారు. ఈరోజు, నేను వారి ధైర్యాన్ని, పరాక్రమాన్ని మన దేశంలోని ప్రతి తల్లి, సోదరి మరియు బిడ్డలకు అంకితం చేస్తున్నాను.’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions