Sri Reddy News Latest | నటి శ్రీరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుండి తాను వివాదాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
తన జీవితం నిత్య పోరాటమని, కానీ ఇప్పుడు తనకు ఓపిక నదించిందన్నారు. తన ఒక్కదాని మూలంగా ఇండస్ట్రీలో ఎటువంటి మార్పు రాదని, ఒక మూస ధోరణిలో వెళ్తున్న వాటిని ఎవరూ మార్చలేరని తెలిపారు. తనలా ఎదురించి ఎవరూ పేరు, జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు.
ఎవరిలో ఎటువంటి మార్పు రాదన్నారు. నా అనుకున్న వాళ్ళు కూడా ఎందుకూ పనికిరాని ఇతరుల్ని ప్రోత్సహిస్తారు, మనల్ని పక్కన పడేస్తారని శ్రీరెడ్డి అన్నారు. తన జీవితం ఎందరికో గుణపాఠమని శ్రీరెడ్డి పోస్ట్ చేశారు.