Monday 21st April 2025
12:07:03 PM
Home > తాజా > ‘రూ.4 వేల కోట్ల ఓడలో..అమెజాన్ ఫౌండర్ పెళ్లి’

‘రూ.4 వేల కోట్ల ఓడలో..అమెజాన్ ఫౌండర్ పెళ్లి’

Jeff Bezos and Lauren Sánchez set for lavish Venice wedding | అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన 61 ఏళ్ల జెఫ్ బెజోస్ తన రెండవ పెళ్లికి సిద్ధమయ్యారు.

అయితే 500 మిలియన్ డాలర్ల సూపర్ యాచ్ లో బెజోస్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. బెజోస్ పెళ్లి మరో అత్యంత ఖరీదైన వేడుక కానుంది. 1993లో మెక్ కెంజి స్కాట్ ( MacKenzie Scott ) ను వివాహమాడిన బెజోస్ సుమారు 25 ఏళ్ల తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు.

అనంతరం జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ ( Lauren Sánchez )  తో డేటింగ్ చేయసాగారు. 2023లో ఈ జంటకు నిశ్చితార్థం కాగా, 2025 జూన్ లో పెళ్లితో ఈ జంట ఒక్కటి కానుంది. ఇటలీ లోని వెనిస్ నగరంలో వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. వీరి పెళ్లికి హాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు, ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరవనున్నారు.

అయితే కేవలం 200 మంది గెస్టులు రావడానికే వెనిస్ నగర అధికారులు అనుమతినిచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువమంది గెస్టులు వస్తే స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబం, కెటీ పెరి, లియనార్డో డికాప్రియో, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, కిమ్ కర్దాషియన్ కుటుంబం, ఓప్రా విన్ ఫ్రె మొదలగు సెలెబ్రెటీలు హాజరవనున్నారు.

ఇదిలా ఉండగా జూన్ లో జరగబోయే వివాహానికి వెనిస్ నగరంలో ఉండే రెండు లగ్జరీ హోటళ్లను ఇప్పటికే బుక్ చేశారు. ఇకపోతే ఈ పెళ్లిలో 500 మిలియన్ డాలర్లు ఖరీదైన బెజోస్ సూపర్ యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఖరీదైన లగ్జరీ ఓడ పేరు కోరు. ఇందులోనే బెజోస్-లారెన్ వివాహం జరగనున్నట్లు సమాచారం.

You may also like
‘విమానం దారి మళ్లింపు..ఢిల్లీ విమానాశ్రయం సీఎం పై ఆగ్రహం’
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions