Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > తాజా > సార్ నాకు క్రికెట్ అంటే ప్రాణం..క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి భావోద్వేగం

సార్ నాకు క్రికెట్ అంటే ప్రాణం..క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి భావోద్వేగం

IT Minister Sridhar Babu Fulfills Cancer Patient’s Wish by Gifting Cricket Kit | హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న క్యాన్సర్ బాధితుడ్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధితుడి మాటలకు మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వాయ్ పేట గ్రామానికి చెందిన భౌత్ నితిన్ కాన్సర్ తో బాధపడుతూ…ఖాజగూడలోని హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా “సార్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నా.. నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్” అంటూ నితిన్ కోరికకు మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే క్రికెట్ కిట్ తెప్పించి ఇచ్చారు. ఏం అవసరమున్నా నేరుగా తననే సంప్రదించాలని నితిన్ తల్లిదండ్రులకు మంత్రి ధైర్యం చెప్పారు.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions