Friday 18th July 2025
12:07:03 PM
Home > తాజా > ‘అవసరమైతే రష్మీక కూతురితో కూడా నటిస్తా’

‘అవసరమైతే రష్మీక కూతురితో కూడా నటిస్తా’

Salman Khan on 31-year age gap with Rashmika | నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం పట్ల వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్.

హీరోయిన్ కు తనకు లేని బాధ ఇతరులకు ఎందుకని ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్, రష్మీక మందన్న జంటగా ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన సినిమా ‘సికందర్’. మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడారు.

సినిమాలో నటించిన రష్మీకకు తనకు మధ్య 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై సల్మాన్ స్పందించారు. రష్మీకకు, ఆమె తండ్రికి లేని బాధ ఇతరులకు ఏంటన్నారు. పనీపాట లేనివారే ఇలాంటి ట్రోల్స్ చేస్తారని మండిపడ్డారు.

రష్మీకకు కుమార్తె పుడితే, ఆమె పెద్ద స్టార్ అయితే తనతో కూడా నటిస్తానని సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అప్పుడు కచ్చితంగా రష్మీక అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు.

You may also like
ktr pressmeet
లోకేశ్ ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి: కేటీఆర్
‘మనసుకు చాలా సంతోషంగా ఉంది’
‘రేవంత్ క్షమాపణలు చెప్పు..లేదంటే’
‘రహస్యంగా కేటీఆర్ లోకేశ్ ను ఎందుకు కలిశాడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions