Complaint filed against Balakrishna, Prabhas for promoting betting app | బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేసిన యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పై తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే.
తాజగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని తెలుగు అగ్ర నటులు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ లపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మారేడ్పల్లికి చెందిన రామారావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ను వీరు ప్రమోట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దింతో లక్షలాది మంది డబ్బులు పోగొట్టుకున్నారని ఫిర్యాదు లో రామారావు ఆరోపించారు. ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. ఇటీవలే రానా దగ్గబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ పై కూడా కేసు నమోదైన విషయం తెల్సిందే.









