Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వెల్కమ్ బ్యాక్..సునీతకు ప్రధాని మోదీ స్వాగతం

వెల్కమ్ బ్యాక్..సునీతకు ప్రధాని మోదీ స్వాగతం

PM Modi welcomes Sunita Williams and crew | ఎనమిది రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ( Sunita Williams ) మరియు బుచ్ విల్మోర్ ( butch wilmore ) 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు.

బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో వారిని తీసుకువచ్చిన క్యాప్సుల్ సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు.

వెల్కమ్ బ్యాక్ క్రూ 9 ( Welcome Back Crew9 ) అని పోస్ట్ చేశారు. పుడమి మిమ్మల్ని మిస్ అయ్యిందని పేర్కొన్నారు. వ్యోమగాముల ధైర్యసాహసాలు, అపరిమిత మానవ స్ఫూర్తికి ఇదొక పరీక్ష అని, సునీతా విలియమ్స్ సహా ఇతర వ్యోమగాములు పట్టుదల అంటే ఎంటో చూపించారని ప్రధాని తెలిపారు.

వారి అచెంచలమైన సంకల్పం ఎందరికో స్ఫూర్తి అని చెప్పారు. అంతరిక్ష అన్వేషణ అంటే మానవ సామర్థ్యం యొక్క పరిమితులను అధిగమించడం, కలలు కనే ధైర్యం మరియు ఆ కలలను వాస్తవంగా మార్చే ధైర్యాన్ని కలిగి ఉండటమని, ఒక మార్గదర్శకురాలు మరియు ఐకాన్ అయిన సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా ఈ స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు. వారిని భూమికి తీసుకువచ్చేందుకు కృషి చేసిన వారందరినీ చూసి అందరూ గర్వపడుతున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions