Sunday 6th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పోసాని అరెస్ట్..జగన్ ఏమన్నారంటే !

పోసాని అరెస్ట్..జగన్ ఏమన్నారంటే !

Ys Jagan Reaction On Posani Arrest | సినీ నటుడు, వైసీపీ నాయకులు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే.

కూటమి సర్కార్ కక్ష పూరిత చర్యల్లో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పోసాని అరెస్ట్ పై స్పందించారు. పోసాని అరెస్ట్ ను జగన్ ఖండించారు.

అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని జగన్ తెలిపారు.

You may also like
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions