Seethamma Vakitlo Sirimalle Chettu Re Release | రేలంగి మావయ్య పాత్ర కోసం రజినీకాంత్ ( Rajinikanth ) కు స్టోరీ చెప్పగా ఆయనకు కథ బాగా నచ్చినట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ( Srikanth Addala ) గతంలో చెప్పిన మాటలు తాజగా వైరల్ అవుతున్నాయి.
విక్టరీ వెంకటేష్ ( Venkatesh ), సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మల్టీ స్టారర్ గా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 2013లో విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసింది.
అయితే సుమారు 12 ఏళ్ల తర్వాత తిరిగి ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మార్చి 7న సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో గతంలో శ్రీకాంత్ అడ్డాల ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అయ్యింది.
పెద్దోడు, చిన్నోడి తండ్రి పాత్ర అయిన రేలంగి మావయ్యగా రజినీకాంత్ ను తీసుకోవాలని భావించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. రజినీకాంత్ ని కలిసి స్టోరీ చెప్పగా, కథ మరియు తెలుగులో నటించాలని ఆసక్తి ఉన్నా ఆ సమయంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో రజినీ నటించలేదని శ్రీకాంత్ అడ్డాల వివరించారు.