CMR College News Latest | మేడ్చల్ ( Medchal ) లోని కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ ( CMR College )లో వీడియోల రికార్డింగ్ అంశం కలకలం రేపుతోంది.
కాలేజి హాస్టల్ ( Hostel ) లోని బాత్రూం ( Bathroom ) వెంటిలేటర్ నుంచి తమను వీడియో తీశారంటూ విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగారు. విద్యార్థినులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇప్పటికే హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అదుపులోకి తీసుకున్న వారి ఫింగర్ప్రింట్స్ ( Fingerprints ) సేకరించారు.
స్టూడెంట్స్ ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలపడంతో గురువారం పరిస్థితి వేడెక్కింది. మరోవైపు మహిళా కమిషన్ కూడా సుమోటోగా కేసును స్వీకరించి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాలేజీకి మూడు రోజుల సెలవును ప్రకటించింది యాజమాన్యం.









