Chamala Kiran About KTR Arrest | ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు రంగం సిద్ధమైందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరో రెండు, మూడు రోజుల్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అవ్వాలని కేటీఆర్ కు చాలా ఇంట్రెస్ట్ గా ఉందని వ్యాఖ్యానించారు.
తనను ఎప్పుడు అరెస్టు చేస్తారా అని కేటీఆర్ ఎదురు చూస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ప్రతి సారి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడనీ, ప్రతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూ కేసులు పెట్టించుకోవాలనే భావనలో కేటీఆర్ ఉన్నారని సెటైర్లు వేశారు. అరెస్టయి ట్రెండింగ్ లోకి రావాలని కేటీఆర్ భావిస్తున్నట్టు ఉన్నాడన్నారు. ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.