Sunday 6th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కొడుకు పేరు పెట్టే విషయంలో కోర్టుకెక్కిన దంపతులు.. చివరికి!

కొడుకు పేరు పెట్టే విషయంలో కోర్టుకెక్కిన దంపతులు.. చివరికి!

couple fighting

Hunsur Court Names A Child | కర్ణాటక లోని మైసూర్ (Mysore) జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన దంపతులకు రెండేళ్ల కిందట ఓ అబ్బాయి జన్మించాడు. తన కొడుకుకు ఆది అనే పేరు పెట్టాలని భర్త.. లేదు అశ్వినో బ్యాంక్ష్ అనే పేరు పెట్టాలని భార్య భావించారు.

ఈ విషయంలో ఇద్దరూ తగ్గకపోవడంతో విభేదాలు వచ్చాయి. అనంతరం తల్లి తన చిన్నారిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అనంతరం విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేసింది.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి గోవిందయ్య.. చిన్నారికి పేరు పెట్టడంలో ఇబ్బంది ఏంటనీ, పేరులో ఏముంది.. పిల్లలకు మంచి సంస్కారం, ఉన్నత విద్యను అందించడం ముఖ్యమని సూచించారు. ఆ బిడ్డకు పేరు పెట్టడానికి కొన్ని పేర్లను కోర్టు సిఫార్సు చేసింది.

ఆ సమయంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలమియా చిన్నారికి ఆర్యవర్ధన్ అనే పేరును సూచించారు. అనంతరం జడ్జి గోవిందయ్య అందరి సమక్షంలో పాపకు ఆర్యవర్ధన్ అని పేరు పెట్టారు. ఈ పేరుకు దంపతులు ఇద్దరూ అంగీకరించారు. ఇక నుంచి సామరస్యంగా జీవిస్తామని కూడా న్యాయమూర్తికి తెలిపారు.

You may also like
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్
ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టార్ హీరో

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions