Monday 3rd August 2026
12:07:03 PM
Home > తెలంగాణ > అందుకే శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా: అల్లు అర్జున్!

అందుకే శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా: అల్లు అర్జున్!

allu arjun pressmeet

Allu Arjun Tweet | పుష్ప-2 (Pushpa 2) ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లో సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sri Tej) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు కూడా నమోదయ్యింది. అయితే అల్లు అర్జున్ ఇంతవరకు ఆ బాలుడ్ని పరామర్శించలేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్నందున తాను శ్రీతేజ్ ను కలవలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. బాలుడు శ్రీతేజ్ పరిస్థితి పట్ల తాను చాలా బాధపడుతున్నానని, దురదృష్టకర ఘటనలో గాయపడిన ఆ చిన్నారి ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉండడం తనను ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

కేసు విచారణలో ఉన్నందున ఆ బాలుడ్ని, బాధిత కుటుంబాన్ని కలవకూడదన్న సలహా మేరకు తాను పరామర్శకు రాలేకపోతున్నానని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు.

బాధిత కుటుంబం క్షేమంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని తెలిపారు. బాలుడు శ్రీతేజ్ వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరలోనే బాలుడి కుటుంబాన్ని కలవాలనుకుంటున్నానని తెలిపారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions