Mohan Babu Meets Journalist Ranjith | నటుడు మోహన్ బాబు ( Mohan Babu ) జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు జర్నలిస్టును స్వయంగా కలిసి సారీ ( Sorry ) చెప్పారు.
హైదరాబాద్ జల్ పల్లి వద్ద గత మంగళవారం హైడ్రామా నెలకొన్న విషయం తెల్సిందే. మోహన్ బాబు నివాసానికి చేరుకున్న మంచు మనోజ్ ( Manchu Manoj ) ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. ఈ క్రమంలో మనోజ్ గేట్లను తీసుకుంటూ లోనికి వెళ్లారు.
ఇదే సమయంలో బయటకు వచ్చిన మోహన్ బాబు ఒక జర్నలిస్టుపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలపై మీ స్పందన ఏంటి అంటూ మోహన్ బాబుకు సదరు జర్నలిస్టు ప్రశ్నించగా, చేతిలోని మైకును లాక్కున్న మోహన్ బాబు దాడి చేశారు. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడా యశోద ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. అతని కుటుంబ సభ్యులను కలిసి ఉద్దేశ్యపూర్వకంగా కొట్టలేదని వివరణ ఇచ్చారు. మోహన్ బాబు వెంట మంచు విష్ణు ( Manchu Vishnu ) కూడా ఉన్నారు.