Sandhya Theatre Stampede | సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఇదే తొక్కిసలాటలో రేవతి కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
దింతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృత్యువుతో పోరాడుతున్న శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.
మరోవైపు భార్య మరణం, కొడుకు ఆసుపత్రిలో ఉండడంతో రేవతి భర్త తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఈ వైపు ఆసుపత్రిలో ఉన్న బాబును, మరోవైపు కూతుర్ని చూసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా స్పందించిన రేవతి భర్త భాస్కర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదన్నారు