Indiramma Houses Mobile App | తెలంగాణ ప్రభుత్వం (Telangna Government) రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందించనున్నారు.
ఈ ఇందిరమ్మ పథకానికి సంబంధించిన మొబైల్ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.
డిసెంబర్ 6 నుంచే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. తొలి విడతలో సొంతింటి స్థలం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.