Rajyasabha Seat For Nagababu ?| జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ( Mega Brother Nagababu )కు సంబంధించి ఒక వార్తా ఆసక్తిని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో కూటమిలో భాగంగా ఇందులో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో నాగబాబును రాజ్యసభకు పంపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.
ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం తో ఇదే విషయంపై చర్చినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ నాగబాబు రాజ్యసభకు ఎంపికైతే మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) తర్వాత ఆ ఫ్యామిలీలో ఈ ఘనత సాధించిన రెండవ వ్యక్తిగా ఆయన నిలుస్తారు.
2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, 2009 ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేసి 18 శాతం ఓట్లను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి కేంద్రమంత్రిగా సేవలందించారు.