Thursday 26th December 2024
12:07:03 PM
Home > తాజా > నయనతారపై కోర్టు మెట్లెక్కిన ధనుష్

నయనతారపై కోర్టు మెట్లెక్కిన ధనుష్

Dhanush Sues Nayanthara Before Madras Court | కోలీవుడ్ ( Kollywood ) లో నటి నయనతార మరియు నటుడు ధనుష్ మధ్య మొదలైన వివాదం కోర్టుకు చేరింది. నయనతార, ఆమె భర్త దర్శకుడు విగ్నేష్ ( Director Vignesh ) పై మద్రాస్ హైకోర్టులో ధనుష్ దావా వేశారు.

నయనతార జీవితం ఆధారంగా ‘ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ‘ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ ( Netflix ) లో విడుదలైన విషయం తెల్సిందే. అయితే తన పేర్మిషన్ లేకుండా నానుమ్ రౌడీ దాన్ మూవీ విజువల్స్ ను వాడుకోవడం పట్ల ధనుష్ నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

నయనతార, విఘ్నేష్ మరియు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ ( Rowdy Pictures ) పై దావా వేశారు. బుధవారం పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం, విచారణకు అంగీకరించింది. కాగా నానుమ్ రౌడీ దాన్ మూవీ షూటింగ్ ( Shooting ) సమయంలోనే తొలిసారి నయనతార, విఘ్నేష్ కలుసుకున్నారు.

ఈ క్రమంలో తమకు ఎంతో ప్రత్యేకం అయిన నానుమ్ రౌడీ దాన్ మూవీ విజువల్స్ ను డాక్యుమెంటరీలో చూపించేందుకు పర్మిషన్ అడిగినా మూవీ నిర్మాత ధనుష్ అంగీకరించలేదని నయనతార ఒక బహిరంగ లేఖను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

You may also like
కాంగ్రెస్ ఫ్లెక్సీలో కశ్మీర్ లేని ఇండియా మ్యాప్..చెలరేగిన వివాదం
19 ఏళ్ల క్రికెటర్ పై కోహ్లీ ప్రవర్తన తప్పు..ఐసీసీ భారీ ఫైన్
సీఎం అయ్యే అవకాశం వచ్చింది..సోనూసూద్ కామెంట్స్
సోఫా చేరాల్సిందే..సీఎంతో ఇండస్ట్రీ భేటీపై అంబటి రాంబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions