NSSO Survey On Telangana | తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్ళు పైబడిన వాళ్లలో అత్యధిక మందికి అప్పులు ఉన్నట్లు తాజగా ఓ నివేదిక వెల్లడైంది. విద్యా, ఆరోగ్యం, అప్పులు, మొబైల్ ( Mobile ), ఇంటర్నెట్ ( Internet ) తదితర అంశాలపై నేషనల్ శాంపుల్ సర్వే సంస్థ నివేదిక వెల్లడించింది.
తెలంగాణలోని 15 సంవత్సరాల వయస్సు పైబడిన వారి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) ఉన్నట్లు తేలింది. 21 నుండి 35 ఏళ్ళు ఉన్న వారిలో ఏకంగా 66.3 శాతం సైన్స్ అండ్ టెక్నాలజీ ( Science And Technology ) లో కోర్సులు చేసిన వారే. 18 ఏళ్ళు పైబడిన 97.5% ప్రజలకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా 18 ఏళ్ళు పైబడిన వారిలో లక్షమందికి 42,407 మంది అప్పుల్లో ఉన్నట్లు తేలింది. ఏమర్జెన్సీ కోసం చేబదులు తీసుకున్నట్లు వారు చెప్పారు. అయితే తిరిగి సకాలంలో చెల్లించడానికి వారికి వనరులు లేవు.
పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రజలే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. జాతీయ స్థాయితో పోల్చితే వైద్య సేవల కోసం తెలంగాణ ఖర్చు అధికం. ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక వ్యక్తి ఏడాది వ్యవధిలో ఆసుపత్రి పాలవుతున్నారు. ఒక్కసారి దవాఖాన ( Hospital )కు వెళ్తే ఇల్లు గుల్లే అని తాజగా నివేదిక వెల్లడించింది.









