Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విల్లా కొంటే లాంబోర్గిని కార్ ఫ్రీ.. రియల్ ఎస్టేట్ సంస్థ బంపరాఫర్!

విల్లా కొంటే లాంబోర్గిని కార్ ఫ్రీ.. రియల్ ఎస్టేట్ సంస్థ బంపరాఫర్!

Lamborghini Car

Buy Villa Get Lamborghini Car | ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా (Noida)కు చెందిన ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ జేపీ గ్రీన్స్ (JayPee Greens) ఓ బంపరాఫర్‌ ప్రకటించింది.

తమ వెంచర్లలో లగ్జరీ విల్లా కొన్నవారికి ఏకంగా లాంబోర్గిని ఉరుస్‌ (Lamborghini Urus) కారును గిఫ్ట్ గా ఇస్తామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

తన ప్రాజెక్టుల్లో రూ.26 కోట్ల విలువైన అల్ట్రా-ప్రీమియం విల్లాలను కొనుగోలు చేసే వారికి లాంబోర్గిని ఉరుస్‌ కారును ఫ్రీగా ఇస్తామని పేర్కొంది. దీంతోపాటు ఈ విల్లాల్లో ఉండే వారికి పలు విలాసవంతమైన సౌకర్యాలను కూడా కల్పించనున్నట్లు వెల్లడించింది.

పార్కింగ్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌, థియేటర్‌, క్లబ్‌ మెంబర్‌షిప్‌, గోల్ఫ్ కోర్స్ కోసం ఈ రూ.26 కోట్లకు అదనంగా మరో రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని జేపీ గ్రీన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కొద్దిరోజుల వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని తెలిపింది.

తమ వద్ద విల్లాలు రూ.51 లక్షల నుంచి రూ.30 కోట్ల వరకు ఉన్నట్లు వివరించింది. గౌరవ్ గుప్తా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఈ ఆఫర్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
police as mother
ఖాకీ దుస్తుల కాఠిన్యం వెనక కరిగిన అమ్మ మనసు.. వీడియో వైరల్!
massive avalanche in jammu kashmir
జమ్మూకశ్మీర్ లో భారీ హిమపాతం.. వీడియో వైరల్!
pet dog stands as a guard for its owner's dead body
ఎముకలు కొరికే చలిలో యజమానికి మృతదేహానికి కాపలాగా నిలిచిన శునకం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions