Washington Sundar Takes 7 Wickets | పూణే వేదికగా భారత్ ( Team India )తో జరుగుతున్న రెండవ టెస్టులో న్యూజీలాండ్ ( Newzealand ) ఆల్ ఔట్ అయ్యింది. తొలి రోజే ఫస్ట్ ఇన్నింగ్స్ ( First Innings ) లో 259 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.
టీ బ్రేక్ ( Tea Break ) సమయానికి 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల వద్ద ఉన్న న్యూజీలాండ్ అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కాన్వె 76 పరుగులు, రచిన్ రవీంద్రా 65 పరుగులతో మరోసారి అదరగొట్టాడు.
మరోవైపు భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ బౌలింగ్ తో న్యూజీలాండ్ బాటర్లను బెంబేలెత్తించాడు. అనూహ్యంగా టీంలోకి సెలెక్ట్ అయ్యి నేడు ఏకంగా 7 వికెట్లు తీశాడు. ఇందులో ఐదుగురు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ ( Clean Bowled ) చేయడం విశేషం. టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం సుందర్ కు ఇదే తొలిసారి.
అలాగే అశ్విన్ కూడా 3 వికెట్లు తీసి రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) డక్ ఔట్ అయ్యాడు.