Arasavalli Surya Temple | ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్య క్షేత్రంలో మరోసారి అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం ఉదయం ఆలయంలోని స్వామి వారి మూలవిరాట్టును ఆ సూర్యకిరణాలు నేరుగా తాకాయి.
లేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఉదయం 6:05 గంటలకు రెండు నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యం కొనసాగింది. బుధవారం రోజున కూడా సూర్యకిరణాలు స్వామి వారి మూల విరాట్ ను తాకనున్నాయి.
ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూల విరాట్ ను నేరుగా తాకుతాయి. అయితే వాతావరణం అనుకూలించక గత రెండేళ్లుగా సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్టును స్పృశించకలేక పోయాయి.
దేశంలోని అతికొద్ది సూర్య దేవాలయాల్లో అరసవిల్లి క్షేత్త్రం కూడా ఒకటి. ఇది శ్రీకాకుళం పట్ణణానికి 2 కి.మీ దూరంలోని అరసవల్లి గ్రామంలో ఉంది.