Friday 2nd May 2025
12:07:03 PM
Home > తాజా > ‘బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయండి’.. హైకోర్టు కీలక ఆదేశాలు!

‘బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయండి’.. హైకోర్టు కీలక ఆదేశాలు!

telangana high court

BRS Office | తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS Party) పార్టీకి హైకోర్ట్ (Telangana High Court) షాకిచ్చింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆరెస్ పార్టీ కార్యాలయాన్ని(BRS Office) 15 రోజుల్లో కూల్చి వేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆ పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చి వేస్తే సరి, లేకపోతే మున్సి పల్ శాఖ అధికారులు కూల్చి వేస్తారని హెచ్చరించింది. పార్టీ ఆఫీసును రెగ్యులరైజ్ చేసేలా మున్సి పల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఆఫీస్ నిర్మాణానికి ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కానీ, నిర్మించిన తర్వా త ఎలా అనుమతి ఇస్తారని న్యాయమూర్తి పిటిషనర్లు ప్రశ్నించారు. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ కార్యా లయం నిర్మాణం చేసిన బీఆర్ఎస్ పార్టీ లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేనందున కూల్చేయాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే పలుసార్లు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు కోర్టుకు వెళ్లారు. తాజాగా కోర్టు కూడా పార్టీ ఆఫీస్ ను కూల్చేయాలని సమర్థించింది.

You may also like
pawan kalyan
నేటి నుంచి వాళ్లను అలా పిలవొద్దు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి!
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions