Friday 2nd May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రపంచ రికార్డ్ అందుకున్న పవన్ కళ్యాణ్ శాఖ

ప్రపంచ రికార్డ్ అందుకున్న పవన్ కళ్యాణ్ శాఖ

Deputy Cm Pawan Kalyan Received World Record Certificate | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) బాధ్యతలు వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది.

ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ( World Record Union )అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు.

ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామసభ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు అందుకోవడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

You may also like
‘కరుంగాలి కంబు’తో పవన్ కళ్యాణ్ ను సత్కరించిన తమిళనాడు నేత
‘మార్క్ శంకర్ సురక్షితం..శ్రీవారి దర్శనానికి పవన్ సతీమణి’
‘అన్నయ్యా..ప్రేమతో ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం’
హిందీ మాకొద్దు అంటే ఎలా?..పవన్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions