Numaish 2024 | హైదరాబాద్ లో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుయాయిష్ (Numaish)కు వేళయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Grounds)లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్- 2024) జనవరి 1న సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.
నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ నుమాయిష్ కొనసాగనుంది. 46 రోజుల పాటు సాగే ఈ నుమాయిష్- ఎగ్జిబిషన్ కు ఎంట్రీ టికెట్ ధరలు, విజిటింగ్ అవర్స్ లల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గతేడాది మాదిరిగా టికెట్ ధర రూ. 40ను కొనసాగించనున్నారు.
నుమాయిష్ సందర్శన వేళలను పని దినాల్లో సాయంత్రం 4 నుండి రాత్రి 10.30 వరకు నిర్ణయించారు. ఇక వీకెండ్స్, సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు.
మహిళలు, చిన్నారులకు ప్రత్యేకం.. ఈ ఏడాది నుమాయిష్ సందర్శనలో మహిళలు, చిన్నారులకు ప్రత్యేకంగా ఓ రోజు కేటాయిస్తన్నారు. జనవరి 9న లేడీస్ డే పేరుతో మహిళలను, 31న ‘చిల్డ్ర న్ స్పె షల్’ పేరుతో పిల్లలకు నుమాయిష్ ను సం దర్శించడానికి అవకాశం కల్పించనున్నారు.
కాగా, ఈసారి నుమాయిష్ లో దాదాపు 2500 వరకు స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో కశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొంటారని వివరించారు. కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్న నేపథ్యంలో విజిటర్లు తప్పనిసరిగా మాస్కు లు ధరించాలని విజ్ఞప్తి చేశారు.