Saturday 17th May 2025
12:07:03 PM
Home > తాజా > 73 రేప్ కేసుల్లో 84 మందికి జీవిత ఖైదు: డీజీపీ నివేదిక

73 రేప్ కేసుల్లో 84 మందికి జీవిత ఖైదు: డీజీపీ నివేదిక

telangana dgp

Telangana DGP | తెలంగాణా డీజీపీ రవి గుప్తా (Ravi Gupta) శుక్రవారం ఉదయం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని తెలిపారు.

గతేడాదితో పోలిస్తే 8.97 శాతం రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 2,13,121 కేసులు నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు 17. 59 శాతం పెరిగాయన్నారు.

ఇక జీరో ఎఫ్ఐఆర్‌(Zero FIR)లు 1108 నమోదు చేశామని చెప్పారు. ఐపీసీ సెక్షన్ కింద 1,38,312 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. 73 రేప్ కేసుల్లో 84 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు 1877 నమోదు చేశామని పేర్కొన్నారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు’
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!
‘కొత్త పార్టీ ప్రచారంపై హరీష్ రావు రియాక్షన్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions