Mahalxmi Ticket | సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు నూతన పథకాలను ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, శాసనసభ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఇతర మంత్రులు ఈ పథకాలను ప్రారంభించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, చేయూత పథకం కింద ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల ఉచిత వైద్యం స్కీమ్స్ ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ” ఉచిత ప్రయాణ టికెట్ చార్జీ రూ.0.00, మహిళా సాధికారత దిశగా తొలి అడుగు” అని ఫ్రీ టికెట్ పై ముద్రించారు. ఇదే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున బాక్సర్ నిఖత్ జరీన్ కు రూ. 2 కోట్ల చెక్ ను అందజేశారు.