Friday 22nd November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > తాండూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం

తాండూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం

We work towards the development of tandoor

-ఎమ్మెల్యేగా మనోహర్‌ రెడ్డిని గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు

-టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్‌ మహారాజ్‌, నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి

తాండూరు : సీఎం రేవంత్‌ రెడ్డి సహకారంతో తాండూరు అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్‌ మహారాజ్‌, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరుడు కాంగ్రెస్‌ నాయ కుడు బుయ్యని శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీనివాస్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసి గెలిపించిన నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ మీడియా సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్‌ మహారాజ్‌, కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, భీమయ్య, ప్రభాకర్‌ గౌడ్‌, కొర్వర్‌ నగేష్‌, సంతోష్‌, వివిధ మండల నాయకులు పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీ నాయ కులు కార్యకర్తలు ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేశా రని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్‌ని మోసం చేసి అభివృద్ధి అని చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరి గెలిపించాలని చెప్పిన కూడా ప్రజలు పట్టం కట్టలేదని అన్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌ గాలి వీచిందని అందుకనే తాండూర్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారని చెప్పడం శోచ నీయమని అన్నారు. రోహిత్‌ రెడ్డి గతంలో కాంగ్రెస్‌ పార్టీలోనే గెలిచారని గుర్తు చేశారు. తాండూరు అంటే కాంగ్రెస్‌ అడ్డా అని అన్నారు. గత ఎన్నికల్లో అన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలిస్తే తాం డూర్లో మాత్రం కాంగ్రెస్‌ గెలిచిందని గుర్తు చేశారు. రోహిత్‌ రెడ్డి తో పాటు అతని అనుచరులు అవినీతి అక్రమాలకు చేసారని అం దుకే ప్రజలు ఆయనను ఓడిరచరు అని అన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సీఎం రేవంత్‌ రెడ్డి సహకారంతో తాండూరు అభి వృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. 6 గ్యారంటీ పథకాలను త్వరలోనే ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మాపై ఉందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన, వేయకపోయినా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలం దరినీ ఒకే విధంగా చూస్తుందని అన్నారు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మనోహర్‌ రెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలి పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బసవరాజ్‌, మల్లి కార్జున్‌ జనార్దన్‌ రెడ్డి, రాకేష్‌ మహారాజ్‌ తదితరులు ఉన్నారు.

You may also like
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా
అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి
వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions