Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > 1985 తర్వాత తొలి సారి ఓడిపోయిన గులాబీ అధిపతి కేసీఆర్..!

1985 తర్వాత తొలి సారి ఓడిపోయిన గులాబీ అధిపతి కేసీఆర్..!

kcr resigns

KCR News| మాజీ సీఎం, గులాబీ బాస్ ( Gulabi Boss ) కేసీఆర్ ( KCR ) కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం ఎదురైంది. సీట్లు తగ్గినా అధికారం తమదే అనే విశ్వాసం తో ఉన్న గులాబీ పార్టీకి కాంగ్రెస్ ( Congress ) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.

39 సీట్లే గెలవడంతో అధికారానికి దూరం అయ్యింది ఆ పార్టీ. అయితే పార్టీ ఓటమి కంటే వ్యక్తిగతంగా కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. సుమారు 40 ఏళ్ల తర్వాత కేసీఆర్ ఆయన పోటీ చేసిన స్థానంలో ఓడిపోయారు.

టిడిపి ( TDP ) అభ్యర్థిగా 1983లో సిద్దిపేట నుండి పోటీ చేసిన కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
అనంతరం 1985 నుండి ఇప్పటివరకు ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఒడిపోకుండా తిరుగులేని నాయకుడిగా ఉన్నారు.

కానీ ఈ ఎన్నికల్లో కామారెడ్డి ( Kamareddy ), గజ్వెల్ ( Gajwel ) ఈ రెండు స్థానాల్లో పోటీ చేసిన గులాబీ బాస్ గజ్వెల్ లో 45 వేల ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

అయితే కామారెడ్డి లో మాత్రం అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ( Venkata Ramana Reddy ) చేతిలో సుమారు 6,700 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు కేసీఆర్. దింతో 1985 తర్వాత తొలి సారి ఓడిపోయారు కేసీఆర్.

You may also like
‘టీడీపీ కి వెన్నుపోటు..రేవంత్ ఓ ద్రోహి’
ఈటల vs మర్రి రాజశేఖర్ రెడ్డి
‘ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గుండాలి’
బీహార్, యూపీ సమాజం నిర్వహించిన ఛాత్ పూజలో ఈటల

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions