BJP Telangana | తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఎన్నికలకు శుక్రవారం తో నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే శుక్రవారం నాడు బీజేపీ లో బీఫార్మ్ మంటలు రాజుకున్నాయి.
టికెట్ ప్రకటించి చివరి నిమిషంలో వేరే అభ్యర్ధులను ప్రకటించడం పై భగ్గుమన్నారు పలువురు నేతలు. ముఖ్యంగా సంగారెడ్డి (Sanga Reddy), వేములవాడ నియోజకవర్గాలు చర్చనీయాంశంగా మారాయి.
తొలుత వేములవాడ (Vemulavada) నుండి తుల ఉమ(Tula Uma)ను, సంగారెడ్డి నుండి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (Rajeswar Rao Desh Panday) లను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది బీజేపీ. కానీ చివరి నిమిషంలో మాత్రం బీఫార్మ్ (B Form) ఇతరులకు ఇచ్చింది.
దింతో తీవ్ర మనస్తాపానికి గురైన దేశ్ పాండే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఫోన్ లోనే హెచ్చరించారు.
నామినేషన్ కూడా వేశాక బీఫార్మ్ ఇయ్యకుండా తన ఇజ్జత్ మొత్తం తీశారని కన్నింటిపర్యంతం అయ్యారు ఆయన. అలాగే తన బీఫార్మ్ ను రూ.4కోట్లకు అమ్ముకున్నారనే ఆరోపించారు దేశ్ పాండే.
మరోవైపు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బీఫార్మ్ ను వేరే వ్యక్తికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు తుల ఉమ.
బీజేపీ లో బీసీ లకు ఇదేనా గౌరవం అంటూ ప్రశ్నించారు. బీజేపీ బీసీ, మహిళా నినాదమంతా బోగస్ అని ధ్వజమెత్తారు ఆమె.