Telangana Rains | తెలంగాణకు భారీ వర్షసూచన (Rain Alert) చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావం కారణంగా పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌పై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ అధికారులు తెలిపారు.
ఈ ఆవర్తనం మంగళవారం నాటికి దక్షిణ దిశకు కదిలే సూచనలున్నట్ల వెల్లడించారు.
దీంతోపాటు ఈ నెల 18న బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో వర్షాలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు.
Read Also: అది నిజమని తేలితే నా భూమి రాసిస్తా: పొంగులేటి
పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీయడంతో రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాల కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: నేషనల్ యూత్ వాలంటీర్ స్కీం.. నెలకు రూ. 5 వేలు పొందండిలా!
బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.









