Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > 52 ఏళ్ల వయస్సులో 150 కి.మీ. ఈది కాకినాడ మహిళ రికార్డ్

52 ఏళ్ల వయస్సులో 150 కి.మీ. ఈది కాకినాడ మహిళ రికార్డ్

52 Year Old Women Swims 150 km In Sea | 52 ఏళ్ల వయస్సులో 150 కి.మీ. ఈది ఓ మహిళ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన గోలి శ్యామల వయస్సు 52 ఏళ్ళు.

తాజగా ఆమె సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రంలో ఈదుతూ తీరానికి చేరింది.

రోజుకు 30 కి.మీ. ఈదాలనే లక్ష్యంతో డిసెంబర్ 28న విశాఖలోని ఆర్కే బీచ్ ( RK Beach ) నుంచి సాహస యాత్రను ప్రారంభించిన శ్యామల జనవరి 3న కాకినాడ రూరల్ లోని సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ కు చేరుకుంది. కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరిగింది.

రోజుకు 30 కి.మీ. ఐదు రోజుల పాటు ఈదుతూ ఆమె ఈ యాత్రను విజయవంతంగా ముగించారు. తీరానికి చేరుకున్న ఆమెను కాకినాడ సీపోర్ట్స్ సీఈఓ మురళీధర్, ఎమ్మెల్యే చినరాజప్ప తదితరులు అభినందించారు.

మార్గమధ్యలో తాబేళ్లు తన వెంట రావడం సంతోషాన్ని కలిగించిందని, జెల్లీ ఫిషు ( Jelly Fish )లు కొంచెం ఇబ్బంది పెట్టాయని శ్యామల తెలిపారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions