Friday 6th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం..

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం..

bus fire in saudi
  • 42 మంది భారతీయులు సజీవ దహనం!

Bus Fire Accident in Saudi | సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు.. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు అగ్నికి ఆహుతు అయ్యింది. ఈ ఘటనలో 42 మంది సజీవదహనం అయినట్లు సమాచారం.

ఈ ప్రయాణీకులందరూ భారతీయులే అని తేలింది. అందులోనూ హైదరాబాద్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతుండగా సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

అంతర్జాతీయ మీడియా ప్రకారం డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టగానే మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని యాత్రికులు సజీవదహనం అయ్యారు. మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బస్సు పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లు సమాచారం.

ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల కోసం సచివాలయంలో స్పెషల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

You may also like
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
Iran warship hit by USA
WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..
ttd
తిరుమల క్యూ లైన్ లో ఫైట్..స్పందించిన టీటీడీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions