3 Afghan Cricketers Dead In Pakistani Airstrike Near Border | పాకిస్థాన్ దేశం జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి చెందారు. మొతంగా పాక్ ఎయిర్ స్ట్రైక్స్ మూలంగా 10 మందికి పైగా అఫ్గాన్ పౌరులు కన్నుమూశారు. ఇటీవలే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.
కానీ గంటల వ్యవధిలోనే పాక్ తన వక్రబుద్దిని మరోసారి బహిర్గతం చేస్తూ అఫ్గాన్ లోని ఈస్ట్రన్ పాక్టికా ప్రావిన్స్ పై వైమానిక దాడి చేసింది. పాకిస్థాన్ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉర్గున్ జిల్లాకు చెందిన అఫ్గాన్ డొమెస్టిక్ క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూన్ పాక్ జరిపిన వైమానిక దాడిలో మృతిచెందారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రికెటర్లు పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దేశీవాళీ క్రికెటర్లు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన అఫ్గాన్ క్రికెట్ బోర్డు, త్వరలో పాకిస్థాన్-శ్రీలంకతో జరగబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ వైమానిక దాడులపై రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు.









