India squad announcement for T20 World Cup | వచ్చే ఏడాది జరగబోయే టీ-20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ టీం ఇండియా జట్టును ప్రకటించింది. వన్డే, టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుభమన్ గిల్ కు నిరాశ ఎదురైంది. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు అవకాశం దక్కింది. అలాగే రింకూ సింగ్ కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. గిల్ స్థానంలో సంజు శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ కు దిగనున్నారు.
సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, బుమ్రా, హర్షిత్ రాణా,అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ తో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. తాజగా సౌత్ ఆఫ్రికాతో ముగిసిన టీ-20 సిరీస్ లో గిల్ పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే ఆయనకు చోటు దక్కలేదు. ఇకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో పొట్టి వరల్డ్ కప్ జరగనుంది.










