CP RadhaKrishnan Files Nomination | ఉప రాష్ట్రపతి ఎన్నికల (Vice President Election) నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి (NDA Candidate) సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ రాజీనామాతో అనివార్యం అయిన ఈ ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది.
ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికారపక్షం ప్రయత్నాలు చేసింది. కానీ విపక్షం ఇండీ కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఏకగీవ్రంగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికకు కావాల్సిన సంఖ్యా బలం ఎన్డీయేకు ఉండటంతో సీపీ రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







