Yuzvendra Chahal – Dhanashree Verma divorce | టీం ఇండియా స్టార్ స్పిన్నర్ యూజ్వేంద్ర చాహల్, ధనశ్రీ విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చాహల్ ఆడుతున్న నేపథ్యంలో మార్చి 20 లోగా విడాకులపై నిర్ణయం తీసుకోవాలని బాంబే హై కోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
విడాకుల కోసం చాహల్-ధనశ్రీ ఫిబ్రవరిలో ముంబయి లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లను చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. ఇప్పటికే రూ.2.37 కోట్లను చెల్లించారు.
పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న క్రమంలో ఆరు నెలల కూలింగ్ పీరియడ్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ, పూర్తి మొత్తంలో భరణం చెల్లించకపోవడంతో ఈ అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దింతో చాహల్ హై కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హై కోర్టు ఆరు నెలల కూలింగ్ పీరియడ్ నుండి మినహాయింపు ఇస్తూ తుదితీర్పును జారీ చేసింది.









