Yuzvendra Chahal And Dhanashree Divorce Rumors | టీం ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
తాజగా ఒకర్ని ఒకరు ఇన్స్టాగ్రామ్ ( Instagram ) లో అన్ ఫాలో ( Unfollow ) చేసుకున్నారు. అంతేకాకుండా ధనశ్రీతో కలిసి ఉన్న ఫోటోలను చాహల్ డిలీట్ చేయడంతో విడాకుల వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
మరోవైపు ఇన్స్టాలో చాహల్ ను అన్ ఫాలో చేసిన ధనశ్రీ ఫోటోలను మాత్రం డిలీట్ చేయలేదు. వీరిద్దరూ త్వరలోనే విడిపోతారని, అధికారిక ప్రకటన చేసేందుకు సమయం పడుతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం మాత్రం తెలియదు. ముంబైకి చెందిన ధనశ్రీ డెంటిస్ట్ మరియు కొరియోగ్రాఫర్. ఆమె వద్ద డాన్సు క్లాసులకు చాహల్ వెళ్ళేవాడు. ఇలా ఈ ఇద్దరి మధ్య ప్రేమ మొదలు కాగా 2020లో వీరికి వివాహం జరిగింది.