YSRCP vs Revanth Reddy | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని టార్గెట్ చేస్తూ మరోసారి ఘాటు ట్వీట్లు చేసింది ఏపీలోని అధికార పార్టీ వైసీపీ (YCP).
గువ్వల బాలరాజు, కొత్త ప్రభాకర్ రెడ్డిలపై దాడిని సానుభూతి కోసం బీఆరెసే సృష్టిస్తుందన్నారు రేవంత్.
ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ (Prasanth Kishore) ప్లాన్ లో భాగంగా సానుభూతికోసం 2018లో వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి, బెంగాల్ లో మమతా బెనర్జీపై దాడి ఘటనలు జరిగాయన్నారు రేవంత్ రెడ్డి.
అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ కూడా సానుభూతి కోసం ప్రశాంత్ కిశోర్ తో కలిసి బీఆరెస్ అభ్యర్థుల పై దాడిని ప్లాన్ చేస్తున్నారంటూ పీసీసీ చీఫ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది వైఎస్సార్సీపీ.
ఆయనకు 75 ఏళ్ళు ఉన్నా పదవి పై మోజు పోతలేదు: కేటీఆర్!
“ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మీద జరిగిన దాడిని అవహేళన చేసే స్థాయికి చేరిందా రేవంత్ రెడ్డి.. నీ రాజకీయం? ఆనాడు మీ దత్తత తండ్రి చంద్రబాబు (Chandrababu) మీద అలిపిరిలో జరిగిన దాడి కూడా ముందస్తు ప్లాన్ చేసుకున్నదేనా?
ఆ బాంబు పేలుళ్ల కోసం దానికి అప్పట్లో ఎవరిచ్చారు సలహా? ఆనాడు ఎన్టీఆర్ (NTR) మీద మల్లెల బాబ్జీ చేసిన దాడి కూడా ఇలాంటిదేనా? దానికి ప్లానిచ్చింది మీ చంద్రబాబేనా?
ఎమ్మెల్సీల కొనుగోళ్లకు డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయావు. మరి దానికి ఎవరిచ్చారు సలహా? కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరమని నీకు ఎవరిచ్చారు సలహా?” అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది వైసీపీ.