YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యి, శాసనమండలి లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని, కేసులు పెట్టిన బయపడొద్దని జగన్ చెప్పారు. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికల మాదిరి వున్నాయని, ఈవియంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
శిశుపాలుడి తప్పుల మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని నేతలకు స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మరియు జనసేన కూటమి సర్కారుకు హనీమూన్ పీరియడ్ నడుస్తుందనీ, వారికి మరి కొంత సమయం ఇద్దామని వైసీపీ అధినేత పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రజల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.