Shock To Duvvada Srinivas | ఇటీవల కుటుంబ వివాదాలతో రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas)కు పార్టీ అధిష్టానం షాకిచ్చింది. టెక్కలి (Tekkali) నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుండి ఆయనను (YSRCP) పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) తప్పించించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్ (Perada Tilak) ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.
అంతేకాకుండా జగన్ పార్టీలో కీలక మార్పులు.. చేర్పులు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy), మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి (Vemapalli Sathish Reddy), మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) లను నియమించారు.
ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి ఆళ్ల నాని (Alla Nani) ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (Dulam Nageswar rao)ను నియమించారు. అలానే వైసీపీ అనుబంధ విభాగాల్లోనూ మార్పులు చేసింది.









