Friday 9th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > గాయపడిన కార్యకర్తను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్!

గాయపడిన కార్యకర్తను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్!

YS Jagan | ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను ఫోన్లో పరామర్శించారు వైసీపీ అధినేత జగన్ (YS Jagan). కాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో పొలం నుంచి వస్తున్న నర్రెడ్డి లక్ష్మారెడ్డిపై టీడీపీ గూండాలు పాశవికంగా దాడి చేశాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో లక్ష్మారెడ్డితో మాట్లాడిన జగన్ దాడికి సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు. అలాగే అన్నివిధాల పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసానిచ్చారు. ఇదిలా ఉండగా తమకు ఓటు వేయలేదనే కారణంతో టీడీపీ ప్రత్యర్థులపై దాడికి పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తోంది.

తమ పార్టీ కార్యకర్తలపై క్షేత్రస్థాయిలో ప్రతీకార చర్యలకు అధికార పార్టీ కార్యకర్తలు దిగుతున్నారని జగన్ పార్టీ పేర్కొంది. వీటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి సోషల్ మీడియా కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడింది.

You may also like
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!
‘కుటుంబ సభ్యుల మృతి..భారత్ కు వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాది’
‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’
ధర్మశాల ఎయిర్పోర్ట్ క్లోజ్..’ముంబయి ఇండియన్స్’ పై ఎఫెక్ట్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions